: ఈ నెలాఖర్లో చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన
సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 30,31 తేదీల్లో విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 30న చోడవరంలో జరగనున్న రైతు సదస్సులో పాల్గొంటారు. అనంతరం 31న నక్కపల్లిలో జరిగే మహిళా సదస్సుకు హాజరవుతారు. అదే రోజున యలమంచిలిలో జరిగే రోడ్ షోలోనూ బాబు పాల్గొంటారు.