: ఈ దేవుడికి గడియారాలంటే మోజు


ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ సమీపంలో ఓ ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళినవారు ఆశ్చర్యపోకమానరు. ఎందుకంటే, అక్కడ ఉన్న చెట్టుకు పెద్ద సంఖ్యలో గడియారాలు వేలాడుతూ ఉంటాయి. ఆ క్షేత్రంలో కొలువుదీరిన బ్రహ్మబాబాకు గడియారాలు సమర్పించడం ఎప్పటినుంచో ఆనవాయతీగా వస్తోంది. ఈ దేవాలయానికి అన్ని రకాల మతస్తులు వస్తారట. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు... ఇలా అందరూ తమతమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటారు. గతంలో ఓ వ్యక్తి తనకు డ్రైవర్ కావాలనుందని, అందుకవసరమైన మెళకువలు చెప్పాలని బ్రహ్మబాబాకు మొక్కుకున్నాడట. అతని కోర్కె తీరి డ్రైవర్ అవడంతో స్వామికి ఓ గడియారాన్ని సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ గడియారాలు మొక్కు రూపేణా చెల్లించడం సంప్రదాయంగా మారింది. ఈ ఆలయ బాధ్యతలన్నీ గ్రామస్తులే చూస్తుంటారు. ముడుపులు కట్టే చెట్టుకు రక్షణ ఏమీ లేకున్నా గడియారాలు ఎవరూ ముట్టుకోరని గ్రామస్తులు తెలిపారు.

  • Loading...

More Telugu News