: ఆంధ్రప్రదేశ్ త్వరలోనే సోలార్ హబ్ గా మారుతుంది: పీయూష్ గోయల్
సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ భేటీ ముగిసింది. చంద్రబాబుతో రెండుగంటలపాటు వివిధ అంశాలపై చర్చించానని పీయూష్ గోయల్ అన్నారు. గడిచిన మూడునెలల్లో ఏపీలో విద్యుత్ కోతలు బాగా తగ్గాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే సోలార్ హబ్ గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి త్వరలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని గోయల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి 2015 మార్చి వరకు ఏపీకి అదనంగా 200 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఈ సెప్టెంబర్ నాటికి 500 మెగావాట్లు, 2015 జనవరి నాటికి మరో 500 మెగావాట్లు విద్యుదుత్పత్తి అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.