: బడాబాబుల కొడుకుల బైక్ రేసింగ్ కు అడ్డుకట్ట వేసిన పోలీసులు


హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన నార్సింగి వద్ద ఆదివారం ఉదయం బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 30 బైకులను స్వాధీనం చేసుకుని, అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఉదయం నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో బైక్ లు నడుపుతూ... రోడ్డుపై వెళుతున్న వాహనదారులను, స్థానికులను రేసర్లు భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో కొంతమంది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన పోలీసులు పక్కా ప్రణాళికతో బైక్ రేసింగ్ ను అడ్డుకున్నారు. వీరిలో కొంతమంది స్టూడెంట్స్ కాగా... మరికొందరు బడాబాబుల కొడుకులని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News