: సానియామీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై వ్యాఖ్యానించనన్న వెంకయ్య
తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా సానియామీర్జాను నియమించుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని... దానిపై తాను స్పందించలేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. హైదరాబాదులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విధంగా స్పందించారు. అయితే, సానియా గొప్ప క్రీడాకారిణి అని మాత్రం అన్నారు. ఇరు రాష్ట్రాలు కలసి చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై రెండు రాష్ట్రాలు దృష్టి సారించాలని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తుంటారని... కావున పొరపాట్లకు తావులేకుండా పాలన సాగించాలని చెప్పారు.