: 208 మంది తెలుగువారిని ఇరాక్ నుంచి ఢిల్లీకి తరలించిన విదేశాంగశాఖ
ఇరాక్ అంతర్యుద్ధంలో చిక్కుకున్న 208 మంది తెలుగువారిని భారత విదేశాంగ శాఖ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తీసుకువచ్చింది. వీరిని ఢిల్లీనుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వారి వారి ప్రాంతాలకు పంపనున్నారు. బాధితులలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు.