: పెన్ను అడిగినందుకు విద్యార్థిని చావబాదిన టీచర్
ఉపాధ్యాయుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ... వారి విపరీత ఆగడాలు మాత్రం రోజుకొకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే పశ్చిమబెంగాల్ లో జరిగింది. తోటి విద్యార్థిని పెన్ను అడిగాడన్న కోపంతో టీచర్ ఓ విద్యార్థిని చావబాదింది. హౌరా పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి... తన పక్క విద్యార్థిని పెన్ను అడిగాడు. పెన్ను అడగడం క్లాస్ లోనే ఉన్న హిందీ టీచర్ కు విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే తన చేతిలో ఉన్న ఇనుప స్కేల్ తో ఆ విద్యార్థిని చావబాదింది. విద్యార్థికి తీవ్రగాయాలవడంతో... టీచర్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.