: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వారు తెలిపారు. దీని ప్రభావం వల్ల వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.