: సోషల్ మీడియాపై కన్నేసిన కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి... వారి ఆదరణను మరింత పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆలోచనతోనే 'సీఎంఓ తెలంగాణ' పేరుతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌ లలో ఖాతాలు తెరిచారు. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఫేస్ బుక్ ఖాతాలో ఎప్పటికప్పుడు కచ్చితంగా పొందుపరచడం ద్వారా వాటికి విస్తృతంగా ప్రచారం కల్పించాలని కేసీఆర్ సీఎంవో అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా వాటిపై ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించే పనిలో పడింది. త్వరలోనే ట్విట్టర్, ఫేస్ బుక్, వెబ్ సైట్లను ఒకేసారి అధికారికంగా ప్రారంభించాలని తెలంగాణ సీఎంఓ అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News