: తిరుమలలో అన్యమత ప్రచారం సరికాదు: కిషన్ రెడ్డి
పవిత్ర హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో అన్యమత ప్రచారం సరికాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అన్యమత ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వకుళామాత ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసినా... అధికారుల నిర్లక్ష్యంతో ఆలయ పనులు ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. ఈ ఉదయం కిషన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.