: విజయవాడలో ఇళ్ల కోసం తీవ్రంగా వెతుకుతున్న ఆంధ్రా టాప్ లీడర్లు


విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రాజధాని రానుందన్న వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకులు విజయవాడలో ఇళ్ల వెతుకులాటలో పడ్డారు. రాజధాని విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ విజయవాడ కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహించాలని అన్ని పార్టీలకు చెందిన టాప్ లీడర్లు దాదాపు నిశ్చయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోసం విజయవాడలోని భారతినగర్ లో ఓ ఇంటిని వెతికారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే విజయవాడలోని పిన్నమనేని ఆస్పత్రి పరిసరాలలో ఒక ఇంటిని తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజయవాడ మొగల్రాజపురంలో ఓ ఇంటిని చూసుకున్నారట. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ లు కూడా విజయవాడలో మంచి ఇళ్ల కోసం అన్వేషణలో పడ్డారు. ఇలా అగ్రరాజకీయనాయకులే కాదు... చోటామోటా లీడర్లు కూడా ప్రస్తుతం విజయవాడలో ఇళ్ల వేటలో పడ్డారు. విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయం 'ఆంధ్రరత్న' భవన్ కూడా త్వరలో కొత్త కళను సంతరించుకోనుంది. ఆంధ్రరత్న భవన్ ను ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఆఫీస్ కింద మార్చాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రరత్న భవన్ కు సరికొత్త హంగులు అద్దేందుకు మూడు కోట్లతో పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News