: మల్కాజ్ గిరి ఎంపీ మహేష్ బాబు ఫ్యాన్ అట!


దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్ గిరికి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డికి ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇష్టమట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్ తన అభిమాన నటుడని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లు తన అభిమాన నటీనటులని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు పిల్లలతో కలసి ప్రతి ఆదివారం సినిమాలకు వెళ్లేవాడినని మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసిన తొలిసారే ఎంపీగా ఆయన గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో లోక్ సత్తా అధినేత జేపీ, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణలను ఆయన ఓడించారు.

  • Loading...

More Telugu News