: రెండు రోజుల్లోనే మాసాయిపేట వద్ద రైల్వే గేట్ ఏర్పాటు చేసిన రైల్వేశాఖ


మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద గురువారం జరిగిన స్కూలు బస్సు ప్రమాదంతో రైల్వేశాఖ మేల్కొంది. మాసాయిపేట రైల్వే క్రాసింగ్ వద్ద శనివారం గేటును ప్రారంభించారు. రైల్వే శాఖ అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ జి. శ్రీనివాసరావు కొత్త రైల్వే గేట్ కు శనివారం పూజాకార్యక్రమం నిర్వహించారు. కాపలా లేని ఈ గేటు వద్ద స్కూల్ బస్సును నాందేడ్ పాసింజర్ ఢీ కొనడంతో 14 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ సంఘటన తరువాత రైల్వే శాఖపై తీవ్రమైన విమర్శలు రావడంతో... రైల్వే అధికారులు హుటాహుటిన కేవలం రెండంటే రెండు రోజుల్లో రైల్వే గేటు ఏర్పాటును పూర్తిచేశారు. ఈ రైల్వే గేట్ వద్ద ముగ్గురు గేట్ మెన్ లను రైల్వే శాఖ నియమించింది. మొదటిసారిగా ముంబయి నుంచి సికింద్రాబాద్ మీదుగా గూడూరు వెళ్లే దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలు వచ్చేముందు గేట్ ను మూశారు.

  • Loading...

More Telugu News