: 60 ఏళ్ల వయసులోనూ పతకం సాధించాడు
తపన ఉండాలే కాని... సాధించడానికి వయసు అడ్డంకి కాదని మైకేల్ గల్ట్ నిరూపించాడు. ఇంగ్లండ్ కు చెందిన ఈ షూటర్ 60 ఏళ్ల వయసులో కూడా పతకాన్ని కొల్లగొట్టాడు. కామన్వెల్త్ క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదండోయ్... కామన్వెల్త్ గేమ్స్ లో అత్యధిక పతకాల రికార్డు (18)ని సమం చేశాడు.