: మాసాయిపేట ప్రమాదానికి సెల్ ఫోన్ డ్రైవింగే కారణం
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయి పేట ఘటనకు కారణం సెల్ ఫోన్ డ్రైవింగే అని ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులు చెప్పారు. ఆ రోజు, తాము బస్సులో కూర్చుని బయటకు చూస్తున్నామని... ఇంతలో రైల్వే లైన్ వచ్చిందని... ఆ సమయంలో డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని సెల్ లో మాట్లాడుతున్నారని చిన్నారులు చెప్పారు. ఇంతలో రైలు వస్తుండడం చూసి గట్టిగా అరిచామని... ఫోన్ మాట్లాడుతున్న డ్రైవర్ తమ కేకలు వినిపించుకోలేదని... ఈ లోపు రైలు వచ్చి బస్సును ఢీ కొందని... ఆ తర్వాత తమకు ఏమైందో తెలియదని గాయపడిన చిన్నారులు చెప్పారు. శనివారం నాడు 9 మంది చిన్నారుల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో యశోద ఆసుపత్రి వైద్యులు వారిని సాధారణ వార్డులోకి మార్చారు. అందులో రుచిత, సాత్విక్, మహిపాల్ రెడ్డిలు తడబడుతూ... ప్రమాదం గురించి జర్నలిస్ట్ లకు వివరించారు.