: పరుగులు పెట్టిన ఆర్టీఐ సిబ్బంది... మద్యం మత్తులో అడ్డంగా దొరికిన కానిస్టేబుల్


ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతం తడ (నెల్లూరు జిల్లా) సమీపంలోని భీమునివారిపాలెం చెక్ పోస్టు (ఉమ్మడి చెక్ పోస్టు)పై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. వీరి రాకను గమనించిన ఆర్టీఐ సిబ్బంది అవినీతి సొమ్మును పడేసి పరుగులు తీశారు. అక్కడే ఎక్సైజ్ కానిస్టేబుల్ రామచంద్ర మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్నాడు. ఎక్సైజ్ అధికారులను చూసిన సదరు కానిస్టేబుల్ కు దెబ్బకు మద్యం మత్తు వదిలిపోయింది. ఏసీబీ అధికారులు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇదే క్రమంలో, చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీఐ చెక్ పోస్టులో కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. లెక్కల్లో చూపని రూ. 88 వేలను స్వాధీనం చేసుకుంది.

  • Loading...

More Telugu News