: తెలంగాణ దళిత మహిళలకు వరమిచ్చిన కేసీఆర్
తెలంగాణ దళిత మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరమిచ్చారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన హామీని అమలు చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో భూమి లేని నిరుపేద దళిత మహిళలకు 3 ఎకరాల భూమిని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. 3 ఎకరాల భూమిని ఇచ్చేందుకు విధి విధానాలతో కూడిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మొదటి పంటకు కావాల్సిన పెట్టుబడిని తెలంగాణ ప్రభుత్వమే అందించనుంది. భూమి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి నిరుపేద దళిత మహిళలకు భూ పంపిణీ ప్రారంభమవుతోంది.