: ఆలమట్టి జలాశయం వరదనీటితో కళకళలాడుతోంది
కర్ణాటకలో కృష్ణానది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టి జలాశయం వరదనీటితో కళకళలాడుతోంది. ఈ జలాశయానికి శనివారం సాయంత్రానికి లక్షా యాభై ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని డ్యాం అధికారులు తెలిపారు. నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి 45 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అదికారులు చెప్పారు. నారాయణపూర్ జలాశయం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 3 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని డ్యాం అధికారులు పేర్కొన్నారు.