: కాకతీయ టెక్నో స్కూల్ పై కేసు నమోదు


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదానికి సంబంధించి కాకతీయ టెక్నో స్కూల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాలపై 304, 337, 338 సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలిసింది. డిప్యూటీ డీఈవో ఫిర్యాదు మేరకు మెదక్ జిల్లా తూప్రాన్ పేటలో కేసు నమోదు చేశారు. స్కూల్ బస్సు ప్రమాద ఘటనలో 14 మంది చిన్నారులు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News