: కొత్త కారు 'మొబిలియో'ను విడుదల చేసిన హోండా


ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ సంస్థ హోండా మోటార్స్ మరో కొత్త కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 'మొబిలియో' పేరుతో ఈ కారును వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. మల్టీ యుటిలిటీ వర్షన్ లో విడుదలైన ఈ కారులో ఏడుగురు ప్రయాణించవచ్చు. పెట్రోల్, డీజిల్ రెండు సెగ్మెంట్లలో ఈ కారు లభిస్తుంది. పెట్రోల్ వర్షన్ కారు రూ. 6.49-8.76 లక్షల శ్రేణుల్లో లభిస్తాయి. డీజిల్ వర్షన్ కారు రూ. 7.89- 10.86 లక్షల శ్రేణుల్లో దొరుకుతాయి. ఈ కారును ఈ రోజు ఢిల్లీలో లాంచ్ చేశారు.

  • Loading...

More Telugu News