: ఉత్తరప్రదేశ్ లో అల్లర్లు...కర్ఫ్యూ విధింపు


ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు హద్దుమీరి తీవ్రరూపం దాల్చాయి. రెండు వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలంపై న్యాయవివాదం ఉంది. దీంతో ఆ స్థలం చుట్టూ ఓ వర్గానికి చెందినవారు ప్రహరీ నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా రెండోవర్గం వారు అడ్డుకున్నారు. దీంతో చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. ఇరువర్గాలకు చెందిన వారు రాళ్లు విసురుకున్నారు. అందుబాటులో ఉన్న వాహనాలను దగ్ధం చేశారు. దాంతో పరిస్థితి అదుపుతప్పింది. రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ రెండు వర్గాల వారు శాంతించకపోవడంతో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో 144వ సెక్షన్ విధించారు. అయినప్పటికీ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. దాడుల్లో ఐదుగురు పోలీసులు సహా 18 మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతానికి అక్కడ కర్ఫ్యూ అమలులో ఉంది.

  • Loading...

More Telugu News