: మారేడుమిల్లిలో 400 కిలోల గంజాయి పట్టివేత
పశ్చిమగోదావరి జిల్లా మారేడుమిల్లిలో గంజాయి అక్రమ రవాణా అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 400 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి బాధ్యులైన 8 మంది నిందితులను వారు అరెస్ట్ చేశారు. 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.