: దటీజ్ అమితాబ్... రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇచ్చేశారు


భారత సినీ నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పినా తక్కువే... టాలెంట్ కనబడితే అభినందించడంలోను, ఇతరులను గౌరవించడంలోను, ఆదర్శంగా నడవడంలోను, ఆర్తులను ఆదుకోవడంలోనూ ఆయనకు ఎవరూ సాటిరారని బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. ఆయన ప్రతిష్ఠను మరింత పెంచే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. 40 ఏళ్లుగా తన మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్న దీపక్ సావంత్ భార్య సరోద్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎప్పటికైనా ఓ లగ్జరీ కారు ఉంటే బాగుంటుందని ఆమెకు చాలా కాలంగా తీరని కోరిక ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న సరోద్ కోరిక అమితాబ్ చెవిన పడింది. అంతే, వెంటనే తన వద్ద ఉన్న రేంజ్ రోవర్ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చేశారు. ఈ రేంజ్ రోవర్ కారంటే అమితాబ్ కు వల్లమాలిన అభిమానం. అమితాబ్ ఏదయినా కారు కొంటే మూడు నాలుగేళ్లు వాడిన తరువాత దానిని మార్చేసి కొత్త కారు తీసుకుంటారు. దాని కాల వ్యవధి కూడా నాలుగేళ్లు మించదు. అలాంటిది రేంజ్ రోవర్ కారును మాత్రం అమితాబ్ 2002లో కొన్నారు. కానీ అమ్మలేదు. దానిలో ఆయన తిరిగింది కూడా చాలా తక్కువ. సరోద్ కోరిక తెలియగానే ఆయన దానిని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీనిపై బాలీవుడ్ మొత్తం అమితాబ్ పేరులాగే ఆయన వ్యక్తత్వం కూడా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News