: సుభాష్ చంద్రబోస్ వాడిన కారు దొరికిందోచ్!
అజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారు జార్ఖండ్ లో కనిపించి స్వాతంత్ర్యోద్యమ రోజుల్ని గుర్తుచేసింది. సుమారు 90 ఏళ్ల క్రితం వాడిన ఈ బేబీ ఆస్టిన్ కారులో సుభాష్ చంద్రబోస్ 1930 నుంచి 1941 వరకు జార్ఖండ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి రగిలించారు. ఇప్పుడది ధన్ బాద్ లోని బరారీకోక్ ప్లాంటు గోడౌన్ లో కనిపించి ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఆ కారును తమకు అప్పగించాలని కుకుంగ్ కోల్ లిమిటెడ్ సీఎండీ తపస్ కుమార్ లాహిరి బరారీకోక్ ప్లాంట్ జనరల్ మేనేజర్ ను కోరారు. దీంతో ఆ కారును కోల్ మేనేజర్ గెస్ట్ హౌస్ కు తరలించారు. అనంతరం బీసీసీఎల్ సంస్థ ఈ కారు గురించి కోల్ కతాలోని నేతాజీ రీసెర్చ్ బ్యూరోకి తెలిపింది. ఈ కారును సుభాష్ చంద్రబోస్ మేనమామ అశోక్ బోస్ ఉపయోగించేవారని వారు తెలిపారు. నేతాజీ కూడా ఈ కారులో తిరిగారని వారు నిర్థారించారు.