: హైదరాబాదులో భారత్-విండీస్ టెస్టు... వైజాగ్ కు 'వన్డే' చాన్స్


హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం భారత్-విండీస్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో వెస్టిండీస్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఆ మ్యాచ్ ల వేదికలను బీసీసీఐ నేడు ఖరారు చేసింది. బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తాయి. టెస్టు సిరీసే కాకుండా విండీస్ జట్టు ఐదు వన్డేల సిరీస్ లోనూ పాల్గొంటుంది. వన్డే మ్యాచ్ లకు కోల్ కతా, విశాఖపట్నం, కటక్, ధర్మశాల, కోచి వేదికలు. ఇక్ ఈ రెండు జట్ల మధ్య ఒకే ఒక టి20 మ్యాచ్ జరగనుంది. ఆ పోరు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో ఓ అంతర్జాతీయ టి20 మ్యాచ్ నిర్వహించనుండడం ఇదే ప్రథమం. అయితే, మ్యాచ్ ల నిర్వహణ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News