: హైదరాబాదులో భారీ వర్షం... వాహనదారులకు నరకం
హైదరాబాదు నగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్ పల్లి, అమీర్ పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు ఈ వానతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. అయితే, వాననీటితో పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. సాయంకాలం కురిసిన వర్షానికి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, వాహనదారులు ఇంటికెళ్లేందుకు గంటల కొద్దీ సమయం పడుతోంది.