: కామన్ వెల్త్ గేమ్స్ పతకాల విజేతలకు రాష్ట్రపతి అభినందనలు
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో జరుగుతున్న 20వ కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు స్వర్ణ పతకం సాధించిన షూటర్ అభినవ బింద్రా, పది మీటర్ల ఎయిర్ పిస్టోల్ లో వెండి పతకం దక్కించుకున్న షూటర్ మలైకా గోయెల్, కాంస్య పతకం పొందిన వెయిట్ లిఫ్టర్ సంతోషి మత్సాలను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలనే పొందాలని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తన వ్యక్తిగత సందేశంలో తెలిపినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వివరించింది.