: దక్షిణకొరియాలో గాంధీ ప్రతిమ ఆవిష్కరణ


మహాత్ముడు మనగడ్డపై పుట్టినా ఆయన ఆదర్శాలను తక్కిన ప్రపంచం కూడా మెరుగైన రీతిలోనే స్వీకరించింది. ఎందరో ప్రపంచ ప్రముఖులు తమకు గాంధీయే ఆదర్శమని చెప్పడం తెలిసిందే. అదే మనదేశం విషయానికొస్తే రాజకీయనేతల విగ్రహాల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ జాతి పునరుజ్జీవానికి పాటుపడిన వ్యక్తులను గౌరవించడంపై ఉండదు. ఈ నేపథ్యంలో ఎక్కడో దక్షిణ కొరియా నగరం బుసాన్ లో గాంధీజీ ప్రతిమను ఏర్పాటు చేయడం విశేషం. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో బుసాన్ నగరానికి కొత్త మేయర్ గా ఎన్నికైన సు హ్యాంగ్ సూ... హాంగ్ బియోప్-సా ఆలయం వద్ద గాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సు మాట్లాడుతూ, గాంధీ అందించిన శాంతి సందేశం ప్రతి కొరియన్ కు స్ఫూర్తి కలిగించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రతిమను భారత శిల్పి గౌతమ్ పాల్ రూపొందించారు.

  • Loading...

More Telugu News