: పట్టపగలే చంద్రబాబు మోసం చేస్తున్నారు: జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు రకరకాలుగా మభ్యపెడుతున్నారని వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మేనిఫెస్టోల్లోనూ రైతురుణాలను, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారని... ఇప్పుడు కొంతమేరకే మాఫీ చేయడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం రుణాలను చెల్లించకుండా రైతులను చంద్రబాబు పట్టపగలే మోసం చేస్తున్నారని విమర్శించారు. కేవలం తన మాటను చెప్పడానికే కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. రాష్ట్రం విడిపోతే ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా... విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఓటు వేయించారని ఆరోపించారు.