: మామిడి మొక్క చుట్టూ ఎలుక ప్రదక్షిణలు... పూజలు చేసిన స్థానికులు
కరీంనగర్ జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. కోనరావుపేట మండలం భావసాయిపేటలో ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ మామిడి మొక్క చుట్టూ ఎలుక ప్రదక్షిణలు చేయసాగింది. ఉదయాన్నే ఇది గమనించిన స్థానికుడొకరు వెంటనే అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించాడు. విషయం ఈ నోటా ఆ నోటా పడి ఊరంతా పాకిపోయింది. దీంతో, ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ మామిడి మొక్కతో పాటు ఆ మూషికానికి కూడా పూజలు చేశారు.