: స్కూల్ బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ కవిత


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాద బాధితులను నిజామాబాద్ ఎంపీ కవిత పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు నివేదిక తయారుచేసి, వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News