: బీహార్ లో చేతులు కలిపిన జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్
సెక్యులర్ పార్టీలైన జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ బీహార్ లో చేతులు కలిపాయి. ఆగస్టు 21న ఆ రాష్ట్రంలో పది స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల కోసం సీట్ల సర్ధుబాటు చేసుకున్నాయి. కాషాయదళం బీజేపీని ఈ ఎన్నికల్లో సమష్టిగా ఢీకొని చిత్తుగా ఓడించేందుకు రెండు నెలల ముందుగానే సిద్ధమయ్యాయి. ఈ మేరకు జేడీ(యూ) మూడు సీట్లు, ఆర్జేడీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన ఈ మూడు పార్టీలు ఇప్పుడు సమైక్యంగా మోడీ హవాను తగ్గించాలని తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, ఆర్జేడీకి ఎప్పటినుంచో పొత్తు ఉంది. అటు బీజేపీతో విరోధం ఉన్న జేడీ(యూ) కూడా ఇప్పుడు వీరితో కలవడం విశేషం.