: ప్రకాశం జిల్లాలో మహిళా టెక్కీ దుర్మరణం


తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన విష్ణుప్రియ ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చెన్నైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఆమె తన స్నేహితులతో కలిసి హైదరాబాదుకు లాంగ్ డ్రైవ్ కు బయల్దేరారు. అయితే, ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న బైక్ ను లారీ వెనుక నుంచి ఢీకొన్నది. దీంతో, విష్ణుప్రియ అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News