: తిరుపతిలో ఫిజియోథెరపీ విద్యార్థిని అదృశ్యం
తిరుపతి రంగంపేటలోని వెంకటపద్మావతి కాలేజీలో ఫిజియోథెరపీ చేస్తున్న విద్యార్థిని కీర్తన అదృశ్యమైంది. రెండు రోజుల నుంచి కీర్తన కనిపించడం లేదు. దీంతో, తన కూతురు ఆచూకీ తెలపాలంటూ విద్యార్థిని తల్లి పార్వతి అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ వార్డెన్ తన కూతురును హింసించేవారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే, హాస్టల్ లో చోరీ జరిగిందని... అందుకే కీర్తన పాయిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.