: ఒబామాతో డిన్నర్ చాన్సు కొట్టేసిన ముంబయి బాలిక


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన అర్ధాంగి మిచెల్లీ ఒబామా ఈ నెల 31న వైట్ హౌస్ లో ఓ ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ రకాల వైకల్యం కలిగిన 12 మంది వ్యక్తుల కోసం ఈ విందు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ డిన్నర్ కు భారత్ కు చెందిన నేహా నాయక్ (23) అనే అమ్మాయిని కూడా ఆహ్వానించడం విశేషం. 100 మీటర్ల పరుగు, షాట్ పుట్ ఈవెంట్లలో స్పెషల్ ఒలింపియన్ అయిన నేహా ఆ ఈవెంట్ కు ప్రపంచ సౌహార్ద్ర రాయబారిగానూ వ్యవహరిస్తోంది. అమెరికా ఆహ్వానంపై నేహా స్పందిస్తూ, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొంది. నేహా వైట్ హౌస్ విందుకు తన టీచర్ జోనితా రోడ్రిగ్స్ తో కలిసి హాజరుకానుంది. ప్రస్తుతం నేహా ముంబయిలోని పునరావాస్ స్పెషల్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తోంది. ఆమె మానసిక వికలాంగురాలు. నేహా అందరిలానే పుట్టిందని, ఐదేళ్ళ వయసులో హై ఫీవర్ బారినపడడంతో మానసిక అభివృద్ధి నిలిచిపోయిందని ఆమె తల్లి ఆశా నాయక్ వెల్లడించారు. తొలుత మామూలు పాఠశాలలో చేర్చామని, అయితే, చదువులో బాగా వెనకబడడంతో పునరావాస్ స్పెషల్ స్కూల్లో జాయిన్ చేశామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News