: జువెనైల్ జస్టిస్ చట్ట సవరణ ముసాయిదాకు న్యాయశాఖ ఆమోదం


జువెనైల్ జస్టిస్ చట్ట సవరణ ముసాయిదాకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దాంతో, అత్యాచారాలకు పాల్పడిన 16 ఏళ్ల పైబడిన బాలనేరస్థులకు మిగతావారితో సమానంగా పరిగణించి శిక్ష విధిస్తారు. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సదరు ముసాయిదా ప్రతిని అన్ని శాఖలకు పంపారు. అనంతరం ఆ డ్రాఫ్ట్ ను కేంద్ర అనుమతి కోసం పంపనున్నారు. గతేడాది డిసెంబర్ 16న వైద్య విద్యార్థినిపై (నిర్భయ ఘటన) జరిగిన సామూహిక అత్యాచారం నేపథ్యంలో వచ్చిన ఒత్తిడి మేరకు చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చారు. యూపీఏ హయాంలో ఈ ఘటన జరిగినప్పటికీ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై దృష్టి పెట్టారు. వెంటనే చట్ట సవరణ కోరుతూ ఫైల్ ను న్యాయశాఖకు పంపారు.

  • Loading...

More Telugu News