: నలుగురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది
రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తరుణ్, వరుణ్, ప్రశాంత్, వైష్ణవిల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మరో ముగ్గురి (శ్రావణి, శిరీష, శరత్) పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాసేపటి క్రితం వీరు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 8 మంది విద్యార్థులు కోలుకోవడంతో వారిని ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించనున్నట్టు తెలిపారు. మరో ఐదు మంది పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.