: 25వేల ఎకరాల్లో ఏపీకి వరల్డ్ క్లాస్ రాజధాని


రాజధాని నిర్మాణంపై ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ఆంధ్రప్రదేశ్ కు 25 వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై నిర్ణయం తీసుకున్న మరుసటి గంట నుంచే రాజధాని నిర్మాణానికి పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ శనివారం మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని రాజధాని సలహా కమిటీతో చర్చలు జరుపనుంది. ఈ సమావేశం తర్వాత శివరామకృష్ణన్ కమిటీ చంద్రబాబును కలుస్తుంది. ఈ రెండు సమావేశాల ద్వారా ఆంధ్రపదేశ్ రాజధానిపై కచ్చితమైన నిర్ణయం రావొచ్చని ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News