: లోక్ సభలో ప్రతిపక్ష హోదా పొందేందుకు కాంగ్రెస్ కు అర్హత లేదు: అటార్నీ జనరల్
లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నానికి నిరాశే మిగిలింది. ఆ అర్హత కాంగ్రెస్ కు లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తేల్చి చెప్పారు. నిర్దిష్ట సంఖ్యలో సీట్లను గెల్చుకోకుండా ఏ పార్టీకీ ఈ హోదా ఇచ్చిన సందర్భం గతంలో ఎన్నడూ లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తెలిపినట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ ను కలసి కాంగ్రెస్ చర్చించింది. అయితే, ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకోలేని సుమిత్రా ఏజీ (అటార్నీ జనరల్) అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని కోరారు. 543 మంది సభ్యులుండే లోక్ సభలో విపక్ష నేత పదవి పొందడానికి అవసరమైన పది శాతం (55 సీట్లు) స్థానాలను కాంగ్రెస్ సాధించలేదని ఆయన చెప్పారు. మరి, ఆ హోదా ఎవరికి దక్కనుందో?