: పెరవలి సీఐని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో శ్రీనివాసరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఓ చోరీ కేసులో శ్రీనివాసరావు నిందితుడు. దీంతో, అతడిని పెరవలి పోలీసులు రెండు రోజులు విచారణ కోసం తీసుకెళ్లారు. అయితే, ఊహించని విధంగా అతను నిన్న రాత్రి మృతి చెందాడు. దీంతో, ఆగ్రహించిన శ్రీనివాసరావు బంధువులు... ఈ దారుణానికి పోలీసులే కారణమని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో, సీఐ గోవిందరాజులును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.