: దేవాలయ పాలకమండళ్లలో ఇకపై ఎస్సీ, ఎస్టీ, మహిళలకు చోటు?
దేవాలయ పాలకమండళ్లలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కచ్చితంగా ప్రాతినిధ్యం ఉండేలా దేవాదాయ చట్టాలలో మార్పు తీసుకురావాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. దీని కోసం ప్రస్తుతం ఉన్న పాలకమండళ్ల కూర్పు, విధివిధానాలను మార్చడానికి ఉన్నతాధికారులతో కలిసి ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన కచ్చితమైన ప్రతిపాదనలతో ముందుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవాదాయ అధికారులను ఆదేశించారు. ఏపీ సర్కార్ అనుకున్నట్టు దేవాదాయ చట్టాలలో మార్పులు వస్తే... టీటీడీ సహా ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కచ్చితంగా చోటు కల్పించాల్సిందే.