: రానున్న 24 గంటల్లో ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు


రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వెల్లడించింది. దీనికి తోడు, విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో, ఉత్తరాంధ్రలో పలుచోట్ల, తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News