: మోడీ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆర్మీచీఫ్ బిక్రంసింగ్
నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఆర్మీ చీఫ్ బిక్రంసింగ్ ప్రశంసలతో ముంచెత్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత దూకుడుగా ఉండే ప్రభుత్వాన్ని తానిప్పటివరకు చూడలేదని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే చైనా సరిహద్దులో రోడ్ల నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులను వెంటనే మంజూరు చేసిందని ఆయన కొనియాడారు. దేశ రక్షణ విషయంలో సర్కార్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనరల్ బిక్రంసింగ్ ఈ నెలాఖరులో రిటైర్ అవనున్నారు. మోడీ లాంటి సమర్థుడి నాయకత్వంలో తనకు కొంతకాలం మాత్రమే పనిచేసే అవకాశం దక్కిందని... ఆ కొద్ది కాలంలోనే మోడీ పనితీరు తనను ఆకట్టుకుందని ఆయన అన్నారు.