: కూకట్ పల్లిలో స్కూలు బస్సులపై ఆర్టీఏ దాడులు... రెండు బస్సులు సీజ్
హైదరాబాద్ కూకట్ పల్లిలో స్కూలు బస్సులపై ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న రెండు బస్సులను సీజ్ చేశారు. మరో 10 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఫైర్ సేఫ్టీ లేవని గుర్తించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.