: పరుగులో గెలిచారు.. ఇక పరుగెత్తకుండా కాళ్లను కోల్పోయారు!


బోస్టన్ మారథాన్ పరుగు పందెం. లక్ష్యం 26.2 కిలోమీటర్లు. వేగంగా వచ్చిన పరుగుల వీరులు చివరి లైన్ ను సమీపించారు. అంతలోనే పేలుళ్లు. వాస్తవానికి లక్ష్యం ముగిసిన వెంటనే భారీ చప్పట్లు, కేరింతలు మార్మోగుతాయి. కానీ, అమెరికాలోని బోస్టన్ లో నెత్తురు చిమ్మింది. ముష్కరులు పేల్చిన బాంబు పేలుళ్లకు అక్కడున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. 140 మందికి పైగా గాయపడ్డారంటే పేలుళ్ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

పరుగెత్తి పరుగెత్తి లక్ష్యాన్ని చేరుకున్న వారికి ఇప్పుడు పరుగెత్తడానికి కాళ్లు లేవని జరిగిన ప్రమాద తీవ్రతను రోడే దీవికి చెందిన రూపెన్ బస్తాజియాన్ వెల్లడించారు. పేలుళ్ల ప్రాంతంలో ఉన్న వారిలో చాలా మందికి కాళ్లు తెగిపోయాయని చెప్పారు. రక్తం మడుగు, తెగిపడిన అవయవాలతో ఆ ప్రాంతంలో ఉన్న భయానక పరిస్థితిని వివరించారు. ఈ ప్రమాదంలో రూపెన్ కు కూడా గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News