: ఇండియాలో పెరిగిపోతున్న సామాజిక్ నెట్ వర్క్ వ్యసనపరులు


భారత విపణిలో ఏదయినా అలవాటు చేసి పెడితే చాలు, అంతులేని సంపదను వెనకేసుకోవచ్చని బ్రిటిషర్లు భారత్ ను పరిపాలించిన సందర్భంగా పలుసందర్భాల్లో పేర్కొన్నారు. అదే సూత్రం నేటికీ పని చేస్తోంది. తాజాగా అమెరికాలోని ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో భారత దేశం సామాజిక నెట్ వర్క్ వాడకంలో రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. పాశ్చాత్య దేశాల్లో కుటుంబాలు నాశనమవడం, వ్యక్తిగత జీవితాలు చిక్కుల్లో పడడంతో సామాజిక నెట్ వర్క్ వినియోగాన్ని తగ్గించగా భారత దేశంలో మాత్రం 37.4 శాతం వృద్ధిని సామాజిక నెట్ వర్క్ లు (ఫేస్ బుక్, ట్విట్టర్, హైక్, వాట్సప్) సాధించాయని ఆ సంస్థ వెల్లడించింది. పట్టణాల్లో ఉన్న సోషల్ నెట్ వర్క్ వాడకందారులు 80 లక్షల మందికిపైగా ఉంటారని ఆ సంస్థ ప్రకటించింది. 2016 నాటికి ఫేస్ బుక్ వినియోగించే అతి పెద్ద దేశంగా భారతదేశం అవతరించనుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News