: చిన్నారులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు


మెదక్ జిల్లా మాసాయిపేటలో స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన చిన్నారులను తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. సికింద్రాబాదు యశోదా ఆసుపత్రికి వెళ్లిన బాబు చిన్నారులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మాసాయిపేట ప్రమాదం ఎందరికో గర్భశోకాన్ని మిగిల్చిందన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనపై ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పిల్లల తల్లిదండ్రులంతా ఇంకా షాక్ లోనే ఉన్నారని ఆయన అన్నారు. చిన్నారులకు మెరుగైన చికిత్స అందించమని డాక్టర్లకు చెప్పానన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు బాబు ప్రకటించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు 50 వేల రూపాయలను అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News