: సానియాపై వ్యతిరేకత లేదు: కిషన్ రెడ్డి
సానియా మీర్జాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను స్థానికులు కాదంటూ సానియాను ఏ స్థానికత ఆధారంగా తెలంగాణ వ్యక్తిగా నిర్ధారించిందని మాత్రమే ప్రశ్నించామని అన్నారు. తమకు సానియాపై ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. 1956కు ముందు వచ్చిన వారినే తెలంగాణ వారిగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్ పది, పదిహేనేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చిన సానియాను ఎలా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అన్నారనే ప్రశ్నించామని ఆయన తెలిపారు. సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయితే, పదేళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రతి ఒక్కరూ తెలంగాణ వారేనని ఆయన స్పష్టం చేశారు.