: ఆయన గురువు కాదు శాడిస్ట్!
హింసించడమే విద్యాబోధన అని భావిస్తున్న కొంతమంది గురువులు ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. తాజాగా, తరగతి గదిలో సహాధ్యాయులతో మాట్లాడినందుకు ఓ టీచర్ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఇనుప చైన్లతో చావబాదాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత అమానుషంగా ప్రవర్తించిన హిందీ టీచర్ జయప్రకాశ్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.