: ప్రేమకు రెడీ... మరి, పెళ్లి?


యువతరం ఆలోచనల్లో వ్యత్యాసం వారి జీవితాలను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తోంది. విద్యావంతులైన యువత ఆలోచనల్లో అపరిపక్వతకు తోడు అవకాశాలు కలసిరావడంతో పెడదారి పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో చేరుతూనే ప్రేమికులుగా మారుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లకు బీజం పడేది ఇక్కడేనని నిపుణులు చెబుతున్నారు. కళాశాల విద్య పూర్తికాగానే క్యాంపస్ సెలక్షన్స్ పేరిట ఉద్యోగాన్ని సంపాదించి ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నారు. చేతి నిండా డబ్బు, అంది వచ్చిన అవకాశాలు, దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులు... ఇవన్నీ కలిపి యువత ఆలోచనలు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నాయి. అయినవాళ్లు దూరంగా ఉండడంతో అడ్డుచెప్పేవాళ్లు లేక స్నేహం, ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని సినిమాలు, షికార్లు, షాపింగ్, పబ్బులు, క్లబ్బులు అంటూ జల్సా చేస్తున్నారు. అమ్మాయిల అలసత్వాన్ని ఆసరాగా తీసుకున్న అబ్బాయిలు క్రేజీనెస్, ఫ్యాషన్, ట్రెండ్, ప్రేమ పేరుతో ‘ఆ ముచ్చట’ కాస్త తీర్చుకుంటున్నారు. దీంతో యువతులు పెళ్లికి ముందే సహజీవనానికి సై అంటున్నారు. ఎవరూ లేరన్న ధైర్యం, సర్ధుకుపోతారులే అన్న ధోరణిలో జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. అంతా తెలుసుకునేసరికి జరగాల్సిందంతా జరిగిపోతోంది. ఆ ముచ్చట తీరినాక పెళ్లికి నిరాకరిస్తూ యువతులను మోసం చేస్తున్నారు కేడీగాళ్లు. డీఎన్ఏ టెస్టు సెంటర్లలో ఎక్కువ మంది యువతీయువకులే ఉండడం విశేషం. స్నేహం పేరుతో అందరితో కలివిడిగా ఉండడం ఎంత తప్పో, ఓ బిడ్డకు తల్లైతే కానీ తెలియరావడం లేదని డీఎన్ఏ టెస్టులు నిర్వహించే టెక్నీషియన్లు చెబుతున్నారు. తమ దగ్గరకు వచ్చే చాలా మంది అమ్మాయిలకు బిడ్డ తండ్రి ఎవరో నిరూపించాల్సి రావడం దారుణమని వారు అభిప్రాయపడుతున్నారు. డీఎన్ఏ సెంటర్లకు వచ్చే 25 శాతం మంది అమ్మాయిలకు ప్రియుడే బిడ్డ తండ్రి అని నిరూపించడానికి తంటాలు పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీంతో యువతరం ఎంత అజాగ్రత్తగా భవిష్యత్ ను పాడు చేసుకుంటున్నారోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News